భారత్‌కు ట్రంప్ మంచి స్నేహితుడు: ఇండియన్ అమెరికన్లు

ABN , First Publish Date - 2020-10-19T23:34:51+05:30 IST

భారత్-అమెరికాల మధ్య సత్సంబంధాల కోసం ట్రంప్‌కు ఓటేయాలని కొంత మంది ఇండియన్ అమెరికన్లు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత్‌కు మంచి స్నేహితుడిగా అభి

భారత్‌కు ట్రంప్ మంచి స్నేహితుడు: ఇండియన్ అమెరికన్లు

న్యూయార్క్: భారత్-అమెరికాల మధ్య సత్సంబంధాల కోసం ట్రంప్‌కు ఓటేయాలని కొంత మంది ఇండియన్ అమెరికన్లు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత్‌కు మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల సమయం దగ్గర పడిన తరుణంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా కొంత మంది భారతీయ అమెరికన్లు ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయాలని కమ్యూనిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ ప్రతినిధి అల్ మాసన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్ల ప్రాముఖ్యతను వివరించారు. అమెరికా అధ్యక్షుడికి మద్దతుగా నిలిచి, మరోసారి ట్రంప్‌ను గెలిపించాలని ఇండియన్ అమెరికన్ ఓటర్లును కోరారు. 


అమ్నియల్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. చైనాకు ఇండియా చెక్ పెట్టాలంటే ట్రంప్ అవసరం తప్పనిసరి అన్నారు. ఇండియా మరింత అభివృద్ధి చెందాలంటే.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయాలని సూచించారు. కశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారని డాక్టర్ శోభా చోక్లింగం గుర్తు చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతుగా నిలినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆమె కృతజ్జతలు తెలిపారు. ఎన్నికల్లో ట్రంప్‌కు సపోర్ట్ చేయాలని కమ్యూనిటీ సభ్యులను కోరారు. 


Updated Date - 2020-10-19T23:34:51+05:30 IST