జో బైడెన్‌కు మద్దతుగా వీడియోను విడుదల చేసిన భారతీయ దంపతులు!
ABN , First Publish Date - 2020-08-22T23:04:38+05:30 IST
అమెరికాలో అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్-అమెరికన్ల ఓటర్లపై రెండు ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఇండియన్-అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్-అమెరికన్ల ఓటర్లపై రెండు ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఇండియన్-అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్న భారత్‌కు చెందిన దంపతులు జో బైడెన్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
వీడియోలోని దృశ్యాల ప్రకారం.. బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుండగా.. భారత్, అమెరికా జాతీయ జెండాలతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. అనంతరం భారత్‌కు చెందిన దంపతులు వినితా, అజయ్ జియాన్ భుటోరియా మాట్లాడుతూ.. నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీని గెలిపించాలని ఇండియన్-అమెరికన్ ఓటర్లకు పిలుపునివ్వడం కనిపిస్తుంది. ‘అమెరికా కా నేతా కైసా హో.. జో బైడెన్ జైసా హో’ అంటూ వినితా, అజయ్ జియాన్ భుటోరియా దంపతులు ఈ వీడియోలో నినదించారు. అనంతరం వివిధ రకాల కమ్యూనిటీలకు చెందిన ఇండియన్-అమెరికన్లు వారి మద్దతును జో బైడెన్, కమలా హారిస్‌కు ఇవ్వడం ఈ వీడియోలో చూడవచ్చు.
కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. జో బైడెన్‌కు మద్దతుగా మరో రెండు ప్రచార వీడియోలోను రూపొందించి, సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు వినితా, అజయ్ జియాన్ భుటోరియా దంపతులు తెలిపారు.