ఫొటోలో ఉన్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?

ABN , First Publish Date - 2020-12-11T22:09:04+05:30 IST

పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఈ ఏడాది మేలో జాతివివక్షతకు జార్జి ఫ్లాయిడ్ అనే వ్యక్తి బలైన సం

ఫొటోలో ఉన్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?

న్యూయార్క్: పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఈ ఏడాది మేలో జాతివివక్షతకు జార్జి ఫ్లాయిడ్ అనే వ్యక్తి బలైన సందర్భంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో వాషింగ్టన్‌లో నిరసనలు తెలుపుతన్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. అది చూసి చలించి పోయిన ఆయన.. దాదాపు 70 మంది నిరసనకారులకు తన నివాసంలో ఆశ్రయం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది. యావత్ ప్రపంచం ఆయనను ప్రశంసించింది. 


ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తే. పేరు రాహుల్ దుబే. గుర్తొచ్చిందా..? ఇప్పుడు ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమోచ్చిందనేగా మీ సందేహం. ప్రస్తుతం ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికి సంబంధించిన హీరోల జాబితాను తాజాగా విడుదల చేసింది. ‘హీరోస్ ఆఫ్ 2020’ పేరుతో విడుదల చేసిన జాబితాలో రాహుల్ దుబే‌కు చోటు దక్కింది. ఈ ఏడాది తమ విధుల పరిధి దాటి సేవ చేసిన వారికి ఈ గౌరవం దక్కింది. 


Updated Date - 2020-12-11T22:09:04+05:30 IST