కువైట్‌లో భారతీయురాలి బలవన్మరణం !
ABN , First Publish Date - 2020-12-01T14:16:26+05:30 IST
కువైట్‌లో గుర్తు తెలియని ఓ భారతీయ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
కువైట్ సిటీ: కువైట్‌లో గుర్తు తెలియని ఓ భారతీయ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కువైట్‌లోని జలీబ్ అల్ షుయౌఖ్‌లో ఆమె నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితురాలిని పోలీసులు ఇంకా గుర్తించకపోవడంతో ఆమె వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.