దుబాయ్‌లో శభాష్ అనిపించుకుంటున్న ఇండియన్ టీచర్స్!

ABN , First Publish Date - 2020-10-08T01:56:13+05:30 IST

దుబాయిలో నివసిస్తున్న భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు తాము కరోనా బారినపడ్డామని తెలిసినా.. వృత్తిపట్ల నిబద్దతతో, విద్యార్థులు నష్టపోకూడదనే

దుబాయ్‌లో శభాష్ అనిపించుకుంటున్న ఇండియన్ టీచర్స్!

దుబాయి: దుబాయిలో నివసిస్తున్న భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు తాము కరోనా బారినపడ్డామని తెలిసినా.. వృత్తిపట్ల నిబద్దతతో, విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటకు చెందిన మహమ్మద్ మోసిన్ దుబాయిలోని గల్ఫ్ మోడల్ స్కూల్‌లో గణిత ఉపాధ్యయుడిగా పని చేస్తున్నారు. కేరళకు చెందిన జోస్ కుమార్.. అదే పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత యూఏఈలో పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో వీరిద్దరూ ఎప్పటిలాగే తమ విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో వారు కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారిద్దరూ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అయితే తమ వల్ల విద్యార్థులు నష్టపోకూడదని భావించిన మహమ్మద్ మోసిన్, జోస్ కుమార్.. ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెప్పే ప్రతిపాధనను స్యూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దానికి వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారివురూ ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కాగా కరోనా సోకిన నేపథ్యంలో విశ్రాంతి తీసుకోకుండా.. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించిన ఈ ఉపాధ్యాయులను పలువురు అభినందిస్తున్నారు. 


Updated Date - 2020-10-08T01:56:13+05:30 IST