అమెరికాలో భారతీయ రెస్టారెంట్ ధ్వంసం.. తిరిగి వెళ్లిపోవాలంటూ..!

ABN , First Publish Date - 2020-06-25T06:08:12+05:30 IST

అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. భారతీయ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా అమెరికా విడిచివెళ్లాలంటూ హెచ్చరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూ

అమెరికాలో భారతీయ రెస్టారెంట్ ధ్వంసం.. తిరిగి వెళ్లిపోవాలంటూ..!

వాషింగ్టన్: అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. భారతీయ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా అమెరికా విడిచివెళ్లాలంటూ హెచ్చరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూ మెక్సికోలోని సాంటే ఫీ సిటీలో బల్జీత్ సింగ్ అనే వ్యక్తికి రెస్టారెంట్ ఉంది. బల్జీత్ సింగ్ రెస్టారెంట్‌లోకి కొందరు దుండగులు చొరబడి.. ఫర్నిచర్‌ను, వంట పాత్రలు, దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా.. ‘వైట్ పవర్’, ‘ట్రంప్ 2020’, ‘గో హోమ్’ అంటూ రెస్టారెంట్‌లో ఎక్కడ పడితే అక్కడ రాశారు. కాగా.. ఈ ఘటపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్‌డీఎఫ్) దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సహించేది లేదని.. దుండగులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన వల్ల బల్జీత్ సింగ్ దాదాపు లక్షడాలర్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-06-25T06:08:12+05:30 IST