దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన లాయర్.. ప్రిసిల్లా జానా మృతి!

ABN , First Publish Date - 2020-10-12T22:04:49+05:30 IST

భారత సంతతికి చెందిన సౌతాఫ్రికా హ్యూమన్‌రైట్స్ లాయర్ ప్రిస్సిల్లా జన (76) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం రో

దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన లాయర్.. ప్రిసిల్లా జానా మృతి!

జొహెన్స్‌బర్గ్: భారత సంతతికి చెందిన సౌతాఫ్రికా హ్యూమన్‌రైట్స్ లాయర్ ప్రిసిల్లా జానా (76) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం రోజు తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా మానవ హక్కుల కమిషన్(ఎస్‌ఏహెచఆర్‌సీ) ప్రకటించింది. ‘దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. వర్ణవివక్షకు వ్యతిరేకంగా, లింగ వివక్షతపై ఆమె రాజీలేని పోరాటం చేశారు. ఆమె కృషి కారణంగానే ఈ రోజు మనం  రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఫలాలు ఆస్వాదిస్తున్నాం’ అని దక్షిణాఫ్రికా మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. కాగా.. దక్షిణాఫ్రికా లా కమిషన్‌లో  ప్రిసిల్లా జానాకు సభ్యత్వం ఉంది. ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా ఆమె పని చేశారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆమె తన సేవలందించారు. ఇదిలా ఉంటే..  ప్రిసిల్లా జానా తన ఇంటర్ విద్యాభ్యాసాన్ని ఇండియాలోనే పూర్తి చేశారు. మెడిసిన్ చదవడం కోసం.. ఆమెకు భారత ప్రభుత్వం స్కాలర్‌షిప్‌‌ను కూడా మంజూరు చేసింది. అయితే 1965లో తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిన  ప్రిసిల్లా జానా.. అక్కడ లా డిగ్రీ పూర్తి చేశారు. లాయర్‌గా 1979 ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 

Updated Date - 2020-10-12T22:04:49+05:30 IST