అమెరికాలో రెచ్చిపోయిన నిరసనకారులు.. భారతీయ కారు డీలర్‌షిప్‌కు నిప్పు
ABN , First Publish Date - 2020-09-02T00:53:52+05:30 IST
అమెరికాలోని విస్కాన్సిన్‌లో గల కేనోషాకు చెందిన జాకబ్ బ్లేక్(27) అనే నల్లజాతీయుడిపై అమెరికన్ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది.

న్యూయార్క్: అమెరికాలోని విస్కాన్సిన్‌లో గల కేనోషాకు చెందిన జాకబ్ బ్లేక్(27) అనే నల్లజాతీయుడిపై అమెరికన్ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బ్లేక్‌కు న్యాయం జరగాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం కేనోషా నిరసనకారుల అల్లర్లతో అట్టుడుకుతోంది. కాగా, కేనోషాలో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు భారత సంతతి ఫ్యామిలీకి చెందిన కారు డీలర్‌షిప్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో దాదాపు 100 వాహనాల వరకు కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు 2.5 మిలియన్ డాలర్లు(రూ.182,792,500) నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు. అందరూ చూస్తుండగానే నిరసనకారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, కానీ ఎవరూ వారికి అడ్డు చెప్పలేదని బాధిత కుటుంబంలోని అన్మోల్ ఖింద్రీ అనే వ్యక్తి వాపోయారు.