ఒమన్‌లో కరోనా బారిన పడ్డ భారతీయుడు !

ABN , First Publish Date - 2020-03-21T19:50:23+05:30 IST

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్(కొవిడ్-19) గల్ఫ్ దేశాలను సైతం వణికిస్తోంది.

ఒమన్‌లో కరోనా బారిన పడ్డ భారతీయుడు !

మస్కట్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్(కొవిడ్-19) గల్ఫ్ దేశాలను సైతం వణికిస్తోంది. ఈ దేశాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గల్ఫ్‌లో చాప కింద నీరులా ఈ మహమ్మారి విస్తురిస్తోంది. తాజాగా ఒమన్‌లో ఓ భారత వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. కేరళ రాష్ట్రం కన్నూర్‌ వాసి ఒమన్‌లోని సలాల్హాలో పని చేస్తున్నాడు. ఇటీవల స్వదేశానికి వచ్చిన అతడు ఈ నెల 13న తిరిగి ఒమన్ వెళ్లాడు.


అక్కడికి వెళ్లిన తర్వాత అతడు తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడడ్డాడు. అనుమానంతో 16వ తేదీన ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. గురువారం అతడి రిపోర్టు రావడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఒమన్‌లో గురువారం ఒక్క రోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ తొమ్మిది కేసులతో కలిపి ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 48కి చేరింది. కాగా, బాధితుల్లో 13 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.    

Updated Date - 2020-03-21T19:50:23+05:30 IST