అజ్మాన్‌లో అనారోగ్యంతో మృతి చెందిన‌ భార‌త వ్య‌క్తి !

ABN , First Publish Date - 2020-04-14T18:15:42+05:30 IST

భార‌త వ్య‌క్తి సోమ‌వారం అజ్మాన్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు.

అజ్మాన్‌లో అనారోగ్యంతో మృతి చెందిన‌ భార‌త వ్య‌క్తి !

అజ్మాన్: భార‌త వ్య‌క్తి సోమ‌వారం అజ్మాన్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు కేరళ రాష్ట్రం చిర‌క్క‌ల్‌ప్ప‌డికి చెందిన ముహమ్మద్ అలీ, బీవతు దంప‌తుల కుమారుడు హ‌నీఫా(40). అజ్మాన్‌లో హ‌నీఫా వైరింగ్ ఉద్యోగిగా ప‌ని చేస్తున్నాడు. నాలుగు నెల‌ల‌ క్రిత‌మే అత‌డు అజ్మాన్ వెళ్లాడు. కాగా, తీవ్రమైన జ్వ‌రం, జ‌లుబుతో బాధ ప‌డిన‌ హ‌నీఫా ఇటీవ‌ల‌ అజ్మాన్‌లోని జీఎంసీ ఆస్ప‌త్రిలో చేరాడు. అక్క‌డే సోమ‌వారం ఉద‌యం చనిపోయిన‌ట్లు అత‌ని బంధువులు తెలిపారు. కాగా, హనీఫాను ఆస్ప‌త్రి వైద్యులు న్యుమోనియాతో మృతిచెందిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. అత‌ని మ‌ర‌ణానికి గ‌ల అస‌లు కార‌ణం కోసం హ‌నీఫా ర‌క్తం శాంపిల్స్‌ను టెస్టు కోసం పంపించారు. నివేదిక వ‌చ్చిన త‌ర్వాత హనీఫా మృతి గ‌ల కార‌ణం తెలియ‌నుంది. హ‌నీఫా అంత్య‌క్రియ‌లు అజ్మాన్‌లోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు అత‌ని బంధువులు తెలియ‌జేశారు. కాగా, హనీఫాకు భార్య సునీర, పిల్లలు హన్నా, ఇషానా, అఫానా ఉన్నారు.

Updated Date - 2020-04-14T18:15:42+05:30 IST