ఒమన్‌లో కరోనా కారణంగా కేరళ నర్సు మృతి!
ABN , First Publish Date - 2020-09-17T00:57:57+05:30 IST
కేరళకు చెందిన ఓ నర్సు కరోనా కారణంగా మృతి చెందిన ఘటన ఒమన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 37ఏ

మస్కట్: కేరళకు చెందిన ఓ నర్సు కరోనా కారణంగా మృతి చెందిన ఘటన ఒమన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 37ఏళ్ల బ్లెస్సీ థామస్.. ఒమన్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. వైరస్ బారినపడ్డారు. దీంతో బ్లెస్సీ థామస్‌ను ఆమె కుటుంబ సభ్యులు.. రాయల్ హాస్పటల్‌లో చేర్పించారు. కాగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందారు. ఆమె మృతిపై ఆ దేశ ఆరోగ్యశాఖ స్పందించి, సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అంతేకాకుండా బ్లేస్సీ థామస్ సేవలను కొనియాడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఒమన్ 90వేల మంది కరోనా బారినపడగా.. 797 మంది ప్రాణాలు కోల్పోయారు.