మెరుగైన సేవల కోసం.. కువైట్‌లోని భారత ఎంబసీ వినూత్న ప్రయోగం

ABN , First Publish Date - 2020-10-12T17:29:09+05:30 IST

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ వినూత్న ప్రయాగం ద్వారా భారత ప్రవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

మెరుగైన సేవల కోసం.. కువైట్‌లోని భారత ఎంబసీ వినూత్న ప్రయోగం

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ వినూత్న ప్రయాగం ద్వారా భారత ప్రవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. కాన్సులర్, కమ్యూనిటీ వెల్ఫేర్ సేవలను మెరుగుపరచడానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రవాసులను కోరుతోంది. దీనికోసం 'ఫీడ్‌బ్యాక్ ఫారమ్' పేరిట వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముద్రించిన ఫారమ్స్‌ను ఎంబసీతో పాటు షరాక్, జలీబ్ అల్ షుయౌక్, ఫహహీల్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వచ్చిన ప్రవాసులకు పంచిపెడుతోంది. వీటిని ఫిల్ చేసిన తర్వాత ఆయా కార్యాలయాల ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన బాక్సులో వేయాలి. ఈ ఫారాలను amboff.kuwait@mea.gov.inకు కూడా పంపించవచ్చు. వీటి ద్వారా ప్రవాసులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఎంబసీ ప్రయత్నిస్తుంది. 

Updated Date - 2020-10-12T17:29:09+05:30 IST