కరోనా ఎఫెక్ట్.. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2020-03-28T22:10:31+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాపై కొవిడ్-19 మహమ్మారి పంజా విసిరింది. దీని కారణంగా యూఎస్‌ఏలో ఇప్పటి వరకు 1704 మంది మరణించగా.. కరోనా వైరస్ సోకిన వారి

కరోనా ఎఫెక్ట్.. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాపై కొవిడ్-19 మహమ్మారి పంజా విసిరింది. దీని కారణంగా యూఎస్‌ఏలో ఇప్పటి వరకు 1704 మంది మరణించగా.. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అమెరికన్ల కోసం మార్చి 30, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 5 గంటలకు.. ఇండియన్ ఎంబసీ ఫేస్‌బుక్‌ పేజీలో యోగా క్లాసులను ప్రసారం చేయనున్నట్లు వివరించింది. ఈ తరగతులను ప్రజలు ఉచితంగా చూడొచ్చని స్పష్టం చేసింది.  ఇదిలా ఉంటే.. ఇండియన్ ఎంబసీ చేసిన ప్రకటనపై అమెరికాలోని ఇండియన్ అంబాసిడర్ తరంజిత్ సింగ్ సంధు ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. కొవిడ్-19 దృష్ట్యా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్.. ప్రజలకు యోగా, మెడిటేషన్‌ను సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉచిత యోగా క్లాసులు ప్రాసారం చేయడానికి భారత రాయబార కార్యాలయం ముందుకొచ్చింది.


Updated Date - 2020-03-28T22:10:31+05:30 IST