కరోనా కాటుకు అమెరికాలో భారతీయుడు మృతి!

ABN , First Publish Date - 2020-03-26T02:25:47+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. మహమ్మారి

కరోనా కాటుకు అమెరికాలో భారతీయుడు మృతి!

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. మహమ్మారి బారినపడి అమెరికాలో భారతీయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8 వరకు ఇండియాలోనే ఉన్న ‘ది బాంబే క్యాంటీన్’ సహ వ్యవస్థాపకుడు, చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్(59).. ఈ మధ్యే అమెరికా వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైరస్ సోకింది. మార్చి 18న ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రాం ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. కాగా.. చికిత్స పొందతూ.. ఈ రోజు ఆయన కన్నుమూశారు. 

Read more