ఖతర్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..!
ABN , First Publish Date - 2020-06-22T19:10:04+05:30 IST
కాన్సులర్ సేవల కోసం ఖతర్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌ను జూన్ 23 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రకటించిం

దోహా: కాన్సులర్ సేవల కోసం ఖతర్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌ను జూన్ 23 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రకటించింది. ఖతర్‌లోని భారతీయుల నుంచి అధిక మొత్తంలో వినతులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబసీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మరింత సమాచారం కోసం ఇండియన్ కల్చరల్ సెంటర్‌ను సంప్రదించాలని ఎంబసీ కోరింది. కొవిడ్-19 విజృంభించక ముందు ఖతర్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో (ఐసీసీ) కాన్సులర్ సేవలు అందుబాటులో ఉండేవి. కరోనా నేపథ్యంలో ఐసీసీలో కాన్సులర్ సేవలను ఇండియన్ ఎంబసీ కార్యాలయం రద్దు చేసింది. ఇదిలా ఉంటే.. ఖతర్‌లో ఇప్పటి వరకు 87వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సుమారు వంద మంది మరణించారు.