దుబాయిలోని ప్రవాసులకు తీపి కబురు.. సెలవు దినాల్లో సైతం..!

ABN , First Publish Date - 2020-07-20T16:18:41+05:30 IST

దుబాయి ఇండియన్ కాన్సులర్ జనరల్ అమన్ పూరి.. ప్రవాసులకు తీపి కబురు చెప్పారు. దుబాయిలో ఇండియన్ కాన్సులర్ జనరల్‌గా అమన్ పూరి.. ఆదివారం రోజు

దుబాయిలోని ప్రవాసులకు తీపి కబురు.. సెలవు దినాల్లో సైతం..!

దుబాయి: దుబాయి ఇండియన్ కాన్సులర్ జనరల్ అమన్ పూరి.. ప్రవాసులకు తీపి కబురు చెప్పారు. దుబాయిలో ఇండియన్ కాన్సులర్ జనరల్‌గా అమన్ పూరి.. ఆదివారం రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆగస్టు 1 నుంచి సెలవు దినాల్లో సైతం.. దుబాయిలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెరిచే ఉంటుందని వెల్లడించారు. వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్‌లలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కాన్సులేట్ జనరల్ కార్యాలయం సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు సెలవు దినాల్లో కూడా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పని చేస్తుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో అత్యవసర ప్రయాణాలను దృష్టిలోపెట్టుకునే.. సెలవు దినాల్లో కూడా సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అమన్ పూరి వివరించారు. ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతుందని పూరి పేర్కొనారు. దుబాయ్, నార్త్ ఎమిరేట్స్ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు సుమారు 1.70లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు ఆయన వివరించారు.  

Updated Date - 2020-07-20T16:18:41+05:30 IST