ప్రతిపక్ష పార్టీ సీఈఓ పదవికి సీమా నందా రాజీనామా
ABN , First Publish Date - 2020-04-25T21:28:02+05:30 IST
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ సీఈఓ సీమా నందా.. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ సీఈఓ సీమా నందా.. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలను ఆమె చెప్పలేదు. కాగా.. 48 ఏళ్ల సీమా నందా.. 2018లో డెమొక్రటిక్ పార్టీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా ఆ పదవి చేపట్టిన మొదటి ఇండో- అమెరికన్‌గా ఆమె గుర్తింపు పొందారు. బ్రౌన్ యూనివర్సిటీ మరియు బోస్టన్ కాలేజ్ లా స్కూల్‌లో సీమా నందా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలో ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వ్యూహంలో భాగంగానే సీమా నందా తన పదవికి రాజీనామా చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. 2004 అధ్యక్ష ఎన్నికల్లో జాన్ కెర్రీ తరఫున క్యాంపైన్ చేసిన మేరీ బెత్ కహిల్.. త్వరలో డెమొక్రటిక్ పార్టీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే సీమా నందా రాజీనామా విషయం ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అయింది.