భారత రాయబారికి పాక్‌ సమన్లు

ABN , First Publish Date - 2020-06-22T14:16:02+05:30 IST

సరిహద్దుల వద్ద భారత ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని పాకిస్థాన్‌ ఆరోపించింది. పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు

భారత రాయబారికి పాక్‌ సమన్లు

  • ఇండియన్‌ ఆర్మీ కాల్పులకు పాల్పడుతుందని ఆరోపణ


ఇస్లామాబాద్‌, జూన్‌ 21: సరిహద్దుల వద్ద భారత ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని పాకిస్థాన్‌ ఆరోపించింది. పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు పంపి, తమ కార్యాలయానికి పిలిపించుకుని డీజీ జాహిద్‌ హఫీజ్‌ నిరసన తెలిపారు. ఈ నెల 20న హజీపిర్‌, బెదోరీ సెక్టార్ల ప్రాంతాల్లో భారత్‌ జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, ఇద్దరికి గాయాలయ్యాయని పాక్‌ చెప్పుకొచ్చింది. 


Updated Date - 2020-06-22T14:16:02+05:30 IST