సౌదీలో ఉన్న కొడుకును కాపాడమంటూ.. కేంద్రాన్ని వేడుకున్న హైదరాబాదీ మహిళ
ABN , First Publish Date - 2020-09-18T07:24:44+05:30 IST
సౌదీ అరేబియాలో ఉన్న కొడుకును కాపాడమంటూ హైదరాబాద్‌కు చెందిన మహిళ కేంద్రాన్ని వేడుకొంది.

హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఉన్న కొడుకును కాపాడమంటూ హైదరాబాద్‌కు చెందిన మహిళ కేంద్రాన్ని వేడుకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షేక్ సాదిఖ్ అనే తన కొడుకు సౌదీలోని జెడ్డాలో గత మూడేళ్లుగా నివసిస్తున్నట్టు ఖతీజా బేగమ్ అనే మహిళ తెలిపింది. జూలై 15న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుపై దాడి చేశాడని.. ప్రస్తుతం తన కొడుకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు ఖతీజా బేగమ్ ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు 23 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్నాడని.. గత పది రోజుల నుంచి అతడి ఆరోగ్యం మరింత విషమంగా మారినట్టు ఖతీజా బేగమ్ తెలిపింది. తన కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియడం లేదని ఖతీజా బేగమ్ ఆవేదన వెల్లగక్కింది. రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ, జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ తన కొడుకు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కాపాడాలంటూ ఖతీజా బేగమ్ కేంద్రాన్ని కోరింది.