చైనాలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2020-10-07T20:36:22+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా చైనాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తోందని చైనాలోని ఇండియన్ ఎంబసీ కార్యలయం ఓ ప్రకటనలో

చైనాలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన!

బీజింగ్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా చైనాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తోందని  చైనాలోని ఇండియన్ ఎంబసీ కార్యలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఈ నెల 23, 30 తేదీల్లో న్యూఢిల్లీ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ‌ నగరానికి ప్రత్యేక విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొంది. చెల్లుబాటయ్యే వీసాలు కలిగిన భారతీయులు ఈ విమానాల్లో చైనాకు రావొచ్చని తెలిపింది. అదేవిధంగా చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి వెళ్లొచ్చని చెప్పింది. చైనాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం ‘వందే భారత్ మిషన్’లో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు విమానాలను ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎంబసీ వివరించింది. ఇదిలా ఉంటే.. ఈ మిషన్ భారత ప్రభుత్వం మే 7 ప్రారంభించింది. ప్రస్తుతం ఏదో దశ ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. ఈ  మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 16లక్షల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 


Updated Date - 2020-10-07T20:36:22+05:30 IST