చైనీయుల వీసాల పట్ల భారత్ మరింత అప్రమత్తత !
ABN , First Publish Date - 2020-08-22T13:23:02+05:30 IST
భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీయులకు జారీ చేసే వీసాల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఇండియా భావిస్తోంది. అదే సమయంలో స్థానిక వర్సిటీలకు బీజింగ్‌తో ఉన్న సంబంధాలపై కూడా సమీక్షించనున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీయులకు జారీ చేసే వీసాల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఇండియా భావిస్తోంది. అదే సమయంలో స్థానిక వర్సిటీలకు బీజింగ్‌తో ఉన్న సంబంధాలపై కూడా సమీక్షించనున్నది. ఒక వార్తా సంస్థలో వచ్చిన తాజా కథనం ప్రకారం.. చైనా వ్యాపార వేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ముందుస్తు భద్రతా క్లియరెన్స్‌ను జారీ చేయనుంది. అలాగే రెండు దేశాల విద్యాసంస్థలు కుదుర్చుకున్న 54 ఒప్పందాల సమీక్షకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.