తగ్గిన విదేశీ మారక నిల్వలు

ABN , First Publish Date - 2020-03-21T16:06:27+05:30 IST

భారత ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు గడిచిన 6 నెలల్లో తొలిసారిగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి.

తగ్గిన విదేశీ మారక నిల్వలు

ముంబై: భారత ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు గడిచిన 6 నెలల్లో తొలిసారిగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. ఈ నెల 13తో ముగిసిన వారంలో నిల్వలు 535 కోట్ల డాలర్లు తగ్గి 48,189 కోట్ల డాలర్లకు పడిపోయాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎ్‌ఫసీఏ) తగ్గడమే ఇందుకు  కారణం. మొత్తం నిల్వల్లో ఎఫ్‌సీఏలదే సింహభాగం. సమీక్షా కాలానికి ఎఫ్‌సీఏలు 378 కోట్ల డాలర్లు తగ్గి 44,736 కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి.

Updated Date - 2020-03-21T16:06:27+05:30 IST