పరీక్షల సంఖ్య పెంచితే.. భారత్, చైనా అమెరికాను దాటేస్తాయ్: ట్రంప్

ABN , First Publish Date - 2020-06-07T03:59:38+05:30 IST

భారత్, చైనా దేశాలు కరోనా పరీక్షల సంఖ్య పెంచితే అమెరికా కంటే ఎక్కువ

పరీక్షల సంఖ్య పెంచితే.. భారత్, చైనా అమెరికాను దాటేస్తాయ్: ట్రంప్

వాషింగ్టన్: భారత్, చైనా దేశాలు కరోనా పరీక్షల సంఖ్య పెంచితే అమెరికా కంటే ఎక్కువ కేసులు నమోదవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మనం 2 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించాం. గుర్తుపెట్టుకోండి.. పరీక్షలు ఎక్కువగా చేస్తే కేసులు ఎక్కువగా వస్తాయి. నేను అమెరికన్లకు మొదటి నుంచి ఇదే చెబుతూ వస్తున్నా. మనం ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాం కాబట్టే ఎక్కువ కేసులు వస్తున్నాయి. భారత్‌, చైనాలలో పరీక్షలు ఎక్కువగా చేస్తే అక్కడ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది’ అని ట్రంప్ అన్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 19,74,521 కేసులు నమోదు కాగా.. 1,11,627 మంది మృత్యువాతపడ్డారు. ఇక భారతదేశంలో ఇప్పటివరకు 2,45,876 కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి భారత్‌లో 6,933 మంది చనిపోయారు. చైనా విషయానికి వస్తే చైనాలో ఇప్పటివరకు 84,177 కేసులు నమోదయ్యాయి. చైనాలో కరోనా కారణంగా మొత్తం 4,638 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించింది. భారత్, చైనాలతో పాటు జర్మనీ, దక్షిణ కొరియాలు కూడా అమెరికా కంటే తక్కువ పరీక్షలు నిర్వహించినట్టు ట్రంప్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T03:59:38+05:30 IST