ఆర్మేనియాకు 4 రాడార్‌ వ్యవస్థల సరఫరా

ABN , First Publish Date - 2020-03-02T09:02:55+05:30 IST

యూరప్‌ దేశమైన ఆర్మేనియాకు స్థానికంగా తయారు చేసిన4 రాడార్‌ వ్యవస్థలను మనదేశం సరఫరా చేయనుంది. ఈ మేరకు రూ.288.7 కోట్లతో భారత్‌

ఆర్మేనియాకు 4 రాడార్‌ వ్యవస్థల సరఫరా

  • రూ.288 కోట్లతో భారత్‌ రక్షణ ఒప్పందం

న్యూఢిల్లీ, మార్చి 1: యూరప్‌ దేశమైన ఆర్మేనియాకు స్థానికంగా తయారు చేసిన4 రాడార్‌ వ్యవస్థలను మనదేశం సరఫరా చేయనుంది. ఈ మేరకు రూ.288.7 కోట్లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని రక్షణ రంగంలో భారత్‌ సాధించిన గొప్ప విజయంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆర్మేనియాకు ఈ రాడార్‌ వ్యవస్థలను సరఫరా చేసేందుకు రష్యా, పోలెండ్‌ పోటీ పడ్డాయి. ఈ రెండు దేశాలను వెనక్కి నెట్టి ఒప్పందాన్ని భారత్‌ దక్కించుకోవడం విశేషం. ఈ రాడార్‌ వ్యవస్థను శత్రుదేశం నుంచి దూసుకొచ్చే ఫిరంగులను గుర్తించేందుకు మన దేశం రూపొందించింది.

Updated Date - 2020-03-02T09:02:55+05:30 IST