రోడ్డుపై వెళ్తున్న చిరుతపులిని చూసేందుకు ఎగబడ్డ జనం

ABN , First Publish Date - 2020-06-23T22:39:23+05:30 IST

పాల్‌లో చిరుతపులిని చూసేందుకు జనం ఎగబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రోడ్డుపై వెళ్తున్న చిరుతపులిని చూసేందుకు ఎగబడ్డ జనం

పర్బత్: నేపాల్‌లో చిరుతపులిని చూసేందుకు జనం ఎగబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పర్బత్ జిల్లాలోని ఓ అడవి సమీపంలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటకే అక్కడకు చేరుకున్న పోలీసులు కొంతమంది స్థానికుల సహాయంతో చిరుతపులిని పట్టుకున్నారు. అయితే ఎటువంటి వాహనంలో పులిని ఎక్కించకుండా.. పులి మెడకు తాడు కట్టి రోడ్డుపైనే నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మిలాన్ చౌక్‌ అనే ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ వరకు రోడ్డుపైనే నడిపించుకుంటూ పోలీసులు పులిని తీసుకెళ్లారు. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న చిరుతపులిని చూసేందుకు.. దాంతో ఫొటోలు దిగేందుకు అనేక మంది ఆసక్తి చూపించారు. చిరుతపులి అనారోగ్యంతో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పులిని పట్టుకున్నామని.. అదే రోజు పులిని జిల్లా అటవీ అధికారులకు అప్పగించేసినట్టు పోలీసులు తెలిపారు.  

Read more