కీలక ప్రకటన చేసిన చైనా..!

ABN , First Publish Date - 2020-03-13T02:26:51+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి తమ దేశంలో నెమ్మదిస్తోందని చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. కమిషన్ అధికార ప్రతినిథి మి ఫెంగ్ గురువారం విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు తె

కీలక ప్రకటన చేసిన చైనా..!

బీజింగ్ : కరోనా వైరస్ వ్యాప్తి తమ దేశంలో నెమ్మదిస్తోందని చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. కమిషన్ అధికార ప్రతినిథి మి ఫెంగ్ గురువారం విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. కరోనా వైరస్ ప్రారంభ స్థానమైన హుబేయ్ ప్రావిన్స్‌లో తొలిసారి 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయయని ఆయన అన్నారు. ఈ ప్రావిన్స్‌లో కొత్తగా కేవలం 8 కేసులు మాత్రమే నమోదైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 


కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించే స్వభావం ఉన్న వైరస్ అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ విజృంభణను నిలువరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దౌత్యవేత్తలు, మరికొన్ని వర్గాలవారికి మినహా ఇతర టూరిస్ట్ వీసాలను ఏప్రిల్ 15 వరకు సస్పెండ్ చేసింది. 

Updated Date - 2020-03-13T02:26:51+05:30 IST