ఈ అక్కాచెల్లెళ్లకు కవల పిల్లలే కావాలట!

ABN , First Publish Date - 2020-08-17T01:21:53+05:30 IST

వారిద్దరూ సమరూప కవలలు. తమకు సమరూప కవలలే భర్తలుగా రావాలని కోరుకున్నారు. అనుకున్న విధంగానే సమరూప కవలలనే భర్తలుగా పొందారు. కా

ఈ అక్కాచెల్లెళ్లకు కవల పిల్లలే కావాలట!

వాషింగ్టన్: వారిద్దరూ సమరూప కవలలు. తమకు సమరూప కవలలే భర్తలుగా రావాలని కోరుకున్నారు. అనుకున్న విధంగానే సమరూప కవలలనే భర్తలుగా పొందారు. కాగా.. వారు తాజాగా ప్రపంచం ఆశ్చర్యపోయే విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఎవరీ సమరూప కవలలు. ఏంటి వారు ప్రకటించిన విషయం అనే వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన బ్రిట్టనీ, బ్రియానా డీన్ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. అంతేకాకుండా వారు సమరూప కవలలు. వీరిద్దరూ తమకు సమరూప కవలలే భర్తలుగా రావాలని కోరుకున్నారు. వారు కోరుకున్న విధంగానే 2018 ఆగస్టులో జోష్, జెరెమీ సాలియర్స్‌ అనే సమరూప కవల సోదరులను పెళ్లాడారు. కాగా.. వారు తాజాగా ఒకేసారి గర్భం దాల్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా తమకు తమలాగే.. సమరూప కవలలు పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదిలా ఉంటే.. ఒకేసారి గర్భం దాల్చడంపట్ల ఆ అక్కాచెల్లెళ్లు సంతోషం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-08-17T01:21:53+05:30 IST