యూఏఈలో ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ ఎగ్జామ్స్ వాయిదా

ABN , First Publish Date - 2020-03-19T19:52:24+05:30 IST

యూఏఈలో కరోనావైరస్(కొవిడ్-19) శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ మహమ్మారి బారినపడే అవకాశం ఉందని ఐసీఎస్ఈ బోర్డు గురువారం 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

యూఏఈలో ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ ఎగ్జామ్స్ వాయిదా

యూఏఈ: యూఏఈలో కరోనావైరస్(కొవిడ్-19) శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ మహమ్మారి బారినపడే అవకాశం ఉందని ఐసీఎస్ఈ బోర్డు గురువారం 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మార్చి 31వ తేదీ వరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(సీఐసీఎస్ఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెర్రీ అరథూన్ వెల్లడించారు. మిగిలిన పరీక్షల నిర్వహణ కోసం సవరించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని స్కూల్ యాజమాన్యాలకు ఆయన తెలియజేశారు. కాగా, ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐసీఎస్ఈ 2020 పరీక్షలు మార్చి 30న, ఐఎస్‌సీ పరీక్షలు మార్చి 31న ముగియాల్సి ఉంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ వాయిదా పడడంతో త్వరలోనే కొత్త తేదీలు ప్రకటించనున్నారు. 

Updated Date - 2020-03-19T19:52:24+05:30 IST