అబుధాబి వెళ్లేందుకు.. ఐసీఏ అనుమ‌తి అవ‌స‌రం లేదు‌

ABN , First Publish Date - 2020-08-12T17:43:31+05:30 IST

యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు భార‌త్ నుంచి అబుధాబి వెళ్లేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ) అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని మంగ‌ళ‌వారం ఎరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌క‌టించింది.

అబుధాబి వెళ్లేందుకు.. ఐసీఏ అనుమ‌తి అవ‌స‌రం లేదు‌

దుబాయ్: యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు భార‌త్ నుంచి అబుధాబి వెళ్లేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ) అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని మంగ‌ళ‌వారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌క‌టించింది. ప్ర‌యాణికులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా జ‌ర్నీకి 96 గంట‌ల ముందు గుర్తింపు పొందిన ల్యాబొరేట‌రీ నుంచి తీసుకున్న కోవిడ్-19 నెగెటివ్ పీసీఆర్ టెస్ట్‌ స‌ర్టిఫికేట్ చూపించాల‌ని తెలిపింది. కానీ..  దుబాయ్, షార్జా వెళ్లే ప్రయాణికులకు ఐసీఏ లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్(జీడీఆర్‌ఎఫ్ఏ) అనుమతి అవసరమని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్ బ్లూ త‌మ ప్రయాణికులకు ఐసీఏ అనుమతి లేకుండానే అబుధాబి, అల్ ఐన్‌ల‌కు ప్రయాణించ‌డానికి బుకింగ్ తీసుకోవడం ప్రారంభించాయి.

Updated Date - 2020-08-12T17:43:31+05:30 IST