ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ!

ABN , First Publish Date - 2020-09-19T18:23:51+05:30 IST

ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లి.. అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కుమార్తెను స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెం

ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ!

హైదరాబాద్: ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లి.. అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కుమార్తెను స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కరీమా బీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీమా బీ కూతురు సమీన.. ఏజెంట్ మాటలు నమ్మి ఓ ఇంట్లో పని చేయడానికి ఒమన్ వెళ్లింది. ఈ క్రమంలో సమీనను తన యజమాని చిత్రహింసలు పెట్టాడు. దీంతో ఇబ్బందులు తట్టుకోలేక.. ఆమె అక్కడ పని మానేసింది. ప్రస్తుతం  సమీన అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కుమార్తెను స్వదేశానికి రప్పించాలని.. సమీన తల్లి, కరీమా బీ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  


Updated Date - 2020-09-19T18:23:51+05:30 IST