కరోనా గురించి కీలక విషయం వెల్లడించిన నిపుణులు.. టీకా వచ్చినా..!

ABN , First Publish Date - 2020-05-29T10:03:35+05:30 IST

జలుబు, తట్టు, ఆటలమ్మ వంటివాటిలాగా.. కొవిడ్‌-19 కూడా పోదని, టీకాను కనుగొన్నా అది దశాబ్దాల తరబడి మనతోనే ఉండిపోతుందని ఎపిడమాలజీ నిపుణు

కరోనా గురించి కీలక విషయం వెల్లడించిన నిపుణులు.. టీకా వచ్చినా..!

వాషింగ్టన్‌, మే 28: జలుబు, తట్టు, ఆటలమ్మ వంటివాటిలాగా.. కొవిడ్‌-19 కూడా పోదని, టీకాను కనుగొన్నా అది దశాబ్దాల తరబడి మనతోనే ఉండిపోతుందని ఎపిడమాలజీ నిపుణులు తేల్చిచెప్పారు. సాధారణ జలుబు నుంచి రకరకాల సార్స్‌, మెర్స్‌ దాకా రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమైన వైర్‌సలు కరోనా కుటుంబంలో చాలానే ఉన్నాయి. వాటిలో నాలుగు రకాల వైర్‌సలతో మానవాళి ఇప్పటికే సహజీవనం చేస్తోంది.


జలుబును కలిగించే కరోనా ఆ నాలుగింటిలో ఒకటి. ఆ కోవలో కొవిడ్‌-19 ఐదోది అవుతుందని ఎపిడమాలజీ నిపుణులు స్పష్టం చేశారు. హెచ్‌ఐవీ వైరస్‌ ఒకప్పుడు ప్రాణాంతకంగానే ఉండేది. కాకపోతే దాని తీవ్రతను త గ్గించే చాలా మందులు అందుబాటులోకి వచ్చా యి. కొవిడ్‌ కూడా అలాగే ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎపిడమాలజిస్టు, ఎవల్యూషనరీ బయాలజిస్టు సారా కోబే తెలిపారు. ‘‘అది ఇక్కడే ఉండబోతోంది. అది ఉన్నా కూడా మనం సురక్షితంగా ఎలా ఉండాలన్నదే ప్రశ్న’’ అని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-05-29T10:03:35+05:30 IST