న్యూయార్క్ చర్చిలో చెలరేగిన మంటలు.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2020-12-07T05:34:27+05:30 IST

న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో ఉన్న పురాతన చర్చిలో మంటలు చెలరేగాయి. చర్చి పక్కనున్న బిల్డింగ్‌లో శనివారం తెల్లవారు జామున

న్యూయార్క్ చర్చిలో చెలరేగిన మంటలు.. ఫొటోలు వైరల్

మన్‌హట్టన్: న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో ఉన్న పురాతన చర్చిలో మంటలు చెలరేగాయి. చర్చి పక్కనున్న బిల్డింగ్‌లో శనివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పక్క బిల్డింగ్ నుంచి మంటలు చర్చిలోకి వ్యాప్తి చెందడంతో చర్చి లోపల చాలా వరకు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. మంటలను అదుపుచేసే క్రమంలో నలుగురు సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై చర్చికి చెందిన రెవ. జాక్లిన్ స్పందిస్తూ.. తమ హృదయం ఎంతో ఆవేదన చెందుతోందని తెలిపారు. కానీ ఏం జరిగినా నిన్న, నేడు, రేపు.. దేవుడు దేవుడేనని అన్నారు. కాగా.. ఈ చర్చిని 127 ఏళ్ల క్రితం నిర్మించారు. పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయాయి.

Updated Date - 2020-12-07T05:34:27+05:30 IST