రక్తమార్పిడితో కరోనాకు చికిత్స!

ABN , First Publish Date - 2020-03-30T15:13:36+05:30 IST

కరోనా బారి నుంచి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని బాధితుడికి మార్పిడి చేయడం ద్వారా చికిత్స కోసం ప్రయత్నిస్తున్నట్లు అమెరికా హూస్టన్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రి వెల్లడింది

రక్తమార్పిడితో కరోనాకు చికిత్స!

  • హూస్టన్‌ ఆస్పత్రిలో ప్రయోగాలు

హూస్టన్‌, మార్చ్‌ 29 : కరోనా బారి నుంచి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని బాధితుడికి మార్పిడి చేయడం ద్వారా చికిత్స కోసం ప్రయత్నిస్తున్నట్లు అమెరికా హూస్టన్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రి వెల్లడింది. కరోనా నుంచి కోలుకుని రెండువారాలపాటు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాతో చికిత్స ప్రారంభించినట్లు హూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి తెలిపింది. 1918లో వచ్చిన ‘స్పానిష్‌ ఫ్లూ’ సమయంలో ఇలానే చికిత్స చేశారని ఆస్పత్రి వర్గాలు  చెప్పాయి. ప్రస్తుతం రోగులకు సపోర్టివ్‌ కేర్‌ ఇవ్వడం మినహా ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాం, అందుకే ‘కాన్‌వాలెసెంట్‌ సెరెమ్‌ థెరపి’ ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నామని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నట్లు ఆస్పత్రి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫిజిషియన్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎరిక్‌ సలాజార్‌ ఒక ప్రకటనలో తెలిపాయి. టెక్సాస్‌లో 34  సహా అమెరికాలో ఈ వారాంతంలో రెండువేల మంది మరణించడంతో చికిత్సను మరింత వేగవంతం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 250 మంది పేషంట్ల నుంచి బ్లడ్‌ ప్లాస్లా సేకరించే పనిలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ జబ్బు గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని, అందుకే రికవరీ పేషంట్లను సంప్రదించే పనిలో ఉన్నామని ఆస్పత్రి ప్రెసిండ్‌, సిఇఓ మార్క్‌ బూమ్‌ చెప్పారు. చికిత్సలో ‘కాన్‌వాలెసెంట్‌ సెరెమ్‌ థెరపి’ ఉపయోగపడుతుందని తేలితే తమ శక్తియుక్తులన్నింటినీ దానిపైనే కేంద్రీకరిస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. కరోనా నుంచి రికవరీ అయిన పేషంట్లలో రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. ఇది వైర్‌సపై అటాక్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ‘కాన్‌వాలెసెంట్‌ సెరెమ్‌ థెరపి’ పద్ధతి 1918 స్పానిష్‌ ఫ్లూ సమయంలోనే కాకుండా, 1920లో వచ్చిన డిప్తీరియా, 1930లో వచ్చిన మాంసాహార భక్షక బాక్టీరియా విజృంభణ సమయంలో కూడా ఉపయోగపడింది.

Updated Date - 2020-03-30T15:13:36+05:30 IST