ప్రాణాలకు తెగించి మూగజీవాలను కాపాడిన అమెరికన్

ABN , First Publish Date - 2020-12-28T21:21:55+05:30 IST

తల్లిదండ్రులు లేని లోటు అనాథలకే తెలుస్తుందని చాలా మంది అంటుంటారు. అంతేకాకుండా కుటుంబంలో పెరిగే వారి కంటే

ప్రాణాలకు తెగించి మూగజీవాలను కాపాడిన అమెరికన్

అట్లాంటా: తల్లిదండ్రులు లేని లోటు అనాథలకే తెలుస్తుందని చాలా మంది అంటుంటారు. అంతేకాకుండా కుటుంబంలో పెరిగే వారి కంటే అనాథలకే జాలి, దయ ఎక్కువగా ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు. అయితే అమెరికాలో ఓ అనాథ వ్యక్తి చేసిన సాహసం గురించి తెలిస్తే పైన చెప్పిన మాటలు అక్షరాలా నిజం అని ప్రతి ఒక్కరు చెబుతారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఉన్న ఓ యానిమల్ షెల్టర్‌కు ఇటీవల నిప్పంటుకుంది. ఇదే సమయంలో అక్కడున్న కీత్ వాకర్ అనే అనాథ వ్యక్తి మూగజీవాలు అగ్నికి ఆహుతై పోతున్నాయని ఆందోళన చెందాడు. ఎలాగైనా మూగజీవాలను కాపాడాలని తన ప్రాణాలకు తెగించి షెల్టర్ లోపలకు వెళ్లాడు.


షెల్టర్ లోపల చిక్కుకున్న ఆరు కుక్కలను, పది పిల్లులను వెంటనే బయటకు తీసుకొచ్చి వాటి ప్రాణాలను కాపాడగలిగాడు. ఆ సమయంలో మూగజీవాలను కాపాడాలనే ఆలోచన తప్ప మరేమీ తనకు రాలేదని కీత్ వాకర్ చెప్పాడు. ఇదిలా ఉంటే.. కీత్ వాకర్ చేసిన సాహసం చూసి షెల్టర్ యజమాని ఉద్వేగానికి గురయ్యాడు. తన జంతువులను కాపాడిన కీత్ వాకర్‌కు ఏ విధంగా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-12-28T21:21:55+05:30 IST