ట్రంప్‌ మళ్లీ గెలవడాన్ని జీర్ణించుకోలేను: హిల్లరీ క్లింటన్

ABN , First Publish Date - 2020-10-28T09:44:18+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ విజయం సాధించడాన్ని తాను జీర్ణించుకోలేనని అమెరికా మాజీ అధ్యక్షుడి భార్య హిల్లరీ క్లింటన్ అన్నారు

ట్రంప్‌ మళ్లీ గెలవడాన్ని జీర్ణించుకోలేను: హిల్లరీ క్లింటన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ విజయం సాధించడాన్ని తాను జీర్ణించుకోలేనని అమెరికా మాజీ అధ్యక్షుడి భార్య హిల్లరీ క్లింటన్ అన్నారు. ఆయన గెలిస్తే తిట్లు, ప్రభుత్వ సంస్థల నాశనం, ప్రపంచంలో అమెరికా ప్రతిష్ఠను దిగజార్చడం వంటి దుష్ప్రభావాలను అమెరికన్లు మరో నాలుగేళ్లు భరించాల్సి వస్తుందని హిల్లరీ పేర్కొన్నారు. కాగా.. గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికి.. ఆమె అధ్యక్ష పీఠాన్ని మాత్రం అందుకోలేకపోయారు. 

Updated Date - 2020-10-28T09:44:18+05:30 IST