ఫైజర్ టీకాను అప్రూవ్ చేసిన కెనడా!
ABN , First Publish Date - 2020-12-10T10:02:55+05:30 IST
జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థతో ఫైజర్ సంస్థ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాక్సిన్

ఒట్టావా: జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థతో ఫైజర్ సంస్థ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అధికారానికి యూకే, బహ్రెయిన్ ప్రభుత్వాలు అనుమతించగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి కెనడా కూడా చేరింది. 16 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్‌ను వేసేందుకు కెనడియన్ హెల్త్ రెగ్యులేటర్ హెల్త్ కెనడా బుధవారం అనుమతులను జారీ చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ రక్షణ, సామర్థ్యంపై తాము స్వతంత్ర రివ్యూను నిర్వహించినట్టు ఈ సందర్భంగా హెల్త్ కెనడా వెల్లడించింది. ఈ రివ్యూ ప్రక్రియను ఎంతో జాగ్రత్తగా నిర్వహించామని, కెనడా దేశస్థులు ఫైజర్ వ్యాక్సిన్‌ను పూర్తిగా నమ్మవచ్చంటూ హెల్త్ కెనడా చెప్పుకొచ్చింది.
వచ్చే వారం ఫైజర్ వ్యాక్సిన్ డోస్‌లు కెనడాలోని 14 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోనున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఇదిలా ఉంటే.. కెనడా ప్రభుత్వం ఇప్పటివరకు 60 లక్షల ఫైజర్ వ్యాక్సిన్ డోస్‌లను ఆర్డర్ చేసింది. ఫస్ట్ షిప్‌మెంట్ కింద 2.49 లక్షల డోస్‌లు అమెరికా, బెల్జియమ్ ప్లాంట్ల నుంచి కెనడాకు చేరుకోనున్నాయి. కెనడాలో ఫైజర్ వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి 16 ఏళ్లు పైబడిన వారికే వేయనున్నారు. మరో అధ్యయనానికి సంబంధించిన డేటా వచ్చిన తరువాత వ్యాక్సిన్‌ను పిల్లలకు కూడా వేసేందుకు హెల్త్ కెనడా అనుమతులను జారీ చేయనుంది.