సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం!

ABN , First Publish Date - 2020-08-16T22:19:06+05:30 IST

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూచిభొట్ల ఆనంద్ సారథ్యంలో సిలికానాంధ్ర.. హనుమాన్ లక్ష గళ పారాయణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించింది. 50పైగా దేశాల

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం!

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూచిభొట్ల ఆనంద్ సారథ్యంలో సిలికానాంధ్ర.. హనుమాన్ లక్ష గళ పారాయణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించింది. 50పైగా దేశాలలో ఉన్న భారతీయులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా హనుమాన్ చాలీసను పారాయణం చేశారు. కాగా..  ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.  ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహకులు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఒకేసారి అత్యధిక మంది హనుమాన్ చాలీసను పారాయణం చేయడాన్ని ఒక సాంకేతిక విశేషంగా పేర్కొన్నారు.  అంతేకాకుండా కూచిపూడి నృత్యం, అన్నమయ్య లక్ష గళార్చన వంటి కార్యక్రమాలను నిర్వహించి.. ఇప్పటి వరకు దాదాపు 10 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌లను సిలికానాంధ్ర సాధించినట్లు తెలిపారు. జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ప్రపంచం కొవిడ్ బారి నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 


ఇదిలా ఉంటే.. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, మధు బాబు ప్రఖ్య, ప్రియ గనుగుల, సాయి కందుల, జ్యోతి చింతలపూడి, స్నేహ వేదుల, మాదబూషి రాజా, గిరిజ లొల్లి, ప్రవీణ్ గుబ్బల తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు కీలక పాత్ర పోషించినట్లు నిర్వహకులు తెలిపారు. మురహరి దేవబత్తిని టెక్నాలజీ పరంగా సహయపడగా.. ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు అశోక్ బడ్డి తొడ్పడ్డట్టు చెప్పారు. ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ.. నిజ జీవన సేవా విశిష్టతను వివరించారు. సంజీవని హాస్పిటల్ ద్వారా సిలికానాంధ్ర.. సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. లక్కిరెడ్డి హనుమిరెడ్డి మాట్లాడుతూ. మంచి పనులు చేయడానికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకోనున్నట్లు పేర్కొన్నారు. సిలికానాంధ్ర.. భారత సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రయాగ్ నుంచి స్వామి ఆనంద్ గిరి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు సిలికానాంధ్ర గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. రామ నామం ద్వారా కరోనాను జయిందామంటూ మధుప్రాఖ్యా పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-08-16T22:19:06+05:30 IST