గల్ఫ్ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి: కవిత
ABN , First Publish Date - 2020-12-07T09:38:54+05:30 IST
గల్ఫ్ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, గల్ఫ్

హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, నకిలీ ఏజెంట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేతలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల నుంచి సొంత ప్రాంతాలకు వచ్చిన రాష్ట్ర వాసులకు తిరిగి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి న్యాక్ ద్వారా ఉపాధి శిక్షణనిస్తున్నామని, దీనిని గ్రామీణ స్థాయికి విస్తరిస్తామన్నారు.