సూపర్ మార్కెట్‌కు వెళ్లి దగ్గిన వ్యక్తి.. పక్కనున్నవారు వెంటనే..

ABN , First Publish Date - 2020-04-09T01:46:29+05:30 IST

సూపర్‌మార్కెట్‌లోని ఉత్పత్తులపై దగ్గి, ఉమ్మి వేసిన వ్యక్తిని కస్టమర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అమెరికాలోని మాసెచూసెట్స్‌లో ఈ

సూపర్ మార్కెట్‌కు వెళ్లి దగ్గిన వ్యక్తి.. పక్కనున్నవారు వెంటనే..

కింగ్‌స్టన్: సూపర్‌మార్కెట్‌లోని ఉత్పత్తులపై దగ్గి, ఉమ్మి వేసిన వ్యక్తిని కస్టమర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అమెరికాలోని మాసెచూసెట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులు, కస్టమర్లు తెలిపిన వివరాల ప్రకారం.. 60కి పైవయసున్న వ్యక్తి కింగ్‌స్టన్‌లోని సూపర్‌మార్కెట్‌కు వచ్చి ఉత్పత్తులపై దగ్గాడు. అనంతరం ఉమ్మి కూడా వేయడంతో ఓ ఉద్యోగి అతడితో ఘర్షణకు దిగాడు. ఆ వ్యక్తి ఉద్యోగితో గొడవ పెట్టుకోగా.. కస్టమర్లు వెంటనే అతడిని పట్టుకుని బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా.. నిందితుడికి కరోనా ఉందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సూపర్ మార్కెట్‌లోని ఆస్తులను ధ్వంసం చేసినందుకు, ఉత్పత్తులపై ఉమ్మి వేసినందుకు అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2020-04-09T01:46:29+05:30 IST