ఇంటి ఆవరణలో ఏముందో తెలుసుకోవడానికి అతనికి 40ఏళ్లు పట్టింది!

ABN , First Publish Date - 2020-12-06T23:18:49+05:30 IST

సాధారణంగా మనం ఓ ఇంటిని కొనుగోలు చేసే ముందు సవాలక్ష ఆలోచించి.. ఆ ఇంటి పరిసరాలను నిశితంగా గమనించిగాని అడుగు ముందుకేయం కదా. అయితే యూకేలో స్థిరపడ్డ ఓ భారత సంతతి వ్య

ఇంటి ఆవరణలో ఏముందో తెలుసుకోవడానికి అతనికి 40ఏళ్లు పట్టింది!

లండన్: సాధారణంగా మనం ఓ ఇంటిని కొనుగోలు చేసే ముందు సవాలక్ష ఆలోచించి.. ఆ ఇంటి పరిసరాలను నిశితంగా గమనించిగాని అడుగు ముందుకేయం కదా. అయితే యూకేలో స్థిరపడ్డ ఓ భారత సంతతి వ్యక్తి మాత్రం వీటిని పట్టించుకోకుండా ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఆ ఇంటి ఆవరణలో ఏముందో తెలుసుకోవడానికి ఆయనకు 40ఏళ్లు పట్టింది. వివరాల్లోకి వెళితే.. ఖందు పటేల్ అనే వ్యక్తి వోల్వెర్హాంప్టన్ ప్రాంతంలో 1920లో నిర్మించిన ఇంటిని 40ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అయితే ఈ 40 ఏళ్లలో తన ఇంటి ఆవరణలో ఉన్న డ్రైనేజీపై ఉండే కప్పును పోలి ఉండే డోరును మాత్రం తెరవలేదు. 


ఈ క్రమంలో కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ కాలంలో ఆయన తన ఇంటి ఆవరణలో ఉన్న ఆ డోర్‌ను తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఎయిర్ రైడ్ షెల్టర్‌ (బంకర్లను పోలి ఉండే నిర్మాణం)ను చూసి బిత్తరపోయాడు. అనంతరం షాక్ నుంచి తేరుకుని.. ఆ సమాచారాన్ని తన స్నేహితుడి చేరవేశాడు. ఆయన సహాయంతో ఆ నిర్మాణాల గోడలకు రంగులకు వేసి.. విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అందంగా ముస్తాబు చేసుకున్నాడు. అంతేకాకుండా అందులో కొన్ని టేబుళ్లను కూడా వేసి ఆ నిర్మాణాన్ని చిన్న‌పాటి బార్‌గా మార్చేశాడు. కాగా.. బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పుడు దానిలో కూర్చొని పార్టీ చేసుకుంటున్నట్లు ఖందు పటేల్ చెప్పారు.  


Read more