ఇజ్రాయిల్ ప్రజలకు ఆ దేశ ప్రధాని తీపి కబురు.. రెండున్నర వారాల్లో!

ABN , First Publish Date - 2020-12-10T23:13:29+05:30 IST

ఇజ్రాయిల్ ప్రజలకు ఆ దేశ ప్రధాని తీపి కబురు చెప్పారు. మరో రెండున్నర వారాల్లో కొవిడ్ వ్యాక్సిన్ వే

ఇజ్రాయిల్ ప్రజలకు ఆ దేశ ప్రధాని తీపి కబురు.. రెండున్నర వారాల్లో!

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రజలకు ఆ దేశ ప్రధాని తీపి కబురు చెప్పారు. మరో రెండున్నర వారాల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేయటాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విలయం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్నీ కొవిడ్ వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాయి. ఈ క్రమంలో తాము అభివృద్ధి చేసిన టీకా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు ఫైజర్ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్రినట్ ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. 



తాజాగా ఇజ్రాయిల్ కూడా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందిచేందుకు సిద్ధం అవుతున్నట్టు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు బుధవారం ప్రకటించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. డిసెంబర్ 27 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రోజుకు 60వేల మందికి టీకా వేయడానికి చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి హెల్త్ అధికారులు గ్రీన్ పాస్‌పోర్ట్‌ను మంజూరు చేస్తారని.. దీంతో వాళ్లు స్వేచ్ఛగా తిరగొచ్చని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఫైజర్ టీకాలతో ఓ విమానం మంగళవారం రోజు ఇజ్రాయిల్‌లో ల్యాండ్ అయింది. వ్యాక్సిన్ కోసం ఫైజర్ సంస్థతో నవంబర్‌లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇజ్రాయిల్ దేశానికి చెందిన పలు సంస్థలు కూడా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. ఆ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఏప్రిల్, మేలో మొదలుకానుంది. 


Updated Date - 2020-12-10T23:13:29+05:30 IST