బుర్జ్ ఖలీఫాపై నుంచి న్యూ ఇయర్ విషెస్ చెప్పేయండిలా..!

ABN , First Publish Date - 2020-12-13T20:58:02+05:30 IST

కొత్త సంవత్సరం వస్తోంది. అందరిలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చే ఏడాది కోసం మీరేం ఆశిస్తు

బుర్జ్ ఖలీఫాపై నుంచి న్యూ ఇయర్ విషెస్ చెప్పేయండిలా..!

అబుధాబి: కొత్త సంవత్సరం వస్తోంది. అందరిలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చే ఏడాది కోసం మీరేం ఆశిస్తున్నారు? మీ సన్నిహితుల కోసం ఏమని అభిలాషిస్తున్నారు? మీ ఆకాంక్షలను మాకు పంపించండి వాటిని పెద్దఎత్తున ప్రదర్శిస్తామని పిలుపినిచ్చింది ప్రపంచంలోని అతి ఎత్తయిన సౌధం బుర్జ్ ఖలీఫా. 


దుబాయిలోని బుర్జ్ ఖలీపా 829 మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకుతుంటుంది. రాత్రిళ్లు ఆ సౌధాన్నంతా ఎల్ఈడీ దీపకాంతులతో మిరిమిట్లుగొలిపేలా చేస్తారు. రంగు రంగుల దీపకాంతులలో అక్షరాలను ఎల్‌ఈడీ ప్యానెల్‌పై డిస్‌ప్లే చేస్తూ బుర్జ్ ఖలీఫా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సందర్భానుసారంగా అనేక సందేశాలను ప్రదర్శిస్తుంటారు. గత ఏడాది డిసెంబర్ 31న అర్ధరాత్రి ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు పంపిన సందేశాలను డిస్‌ప్లే చేశారు. ఈ ఏడాది కూడా సందేశాలను పంపమని కోరుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా సరే తమ అభినందనలు బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించుకోవచ్చు. 35 అక్షరాలకు మించకుండా బుర్జ్ ఖలీఫా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాముల కామెంట్ సెక్షన్లలో #BurjWishes2021 హ్యాష్‌ట్యాగ్‌పై పోస్ట్ చేయాలి. దుబాయ్‌లో న్యూ ఇయర్ సందడికి వెళ్లే వాళ్లు వీటిని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇంట్లోనే లైవ్‌స్ట్రీమ్‌లో చూసేలా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.


Updated Date - 2020-12-13T20:58:02+05:30 IST