కౌలాలంపూర్‌లో చిక్కుకున్న వారిని వెనక్కి రప్పించండి

ABN , First Publish Date - 2020-03-19T09:24:03+05:30 IST

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో చిక్కుకున్న 53 మంది తెలుగు వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ

కౌలాలంపూర్‌లో చిక్కుకున్న వారిని వెనక్కి రప్పించండి

 కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ 

అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో చిక్కుకున్న 53 మంది తెలుగు వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. వారిలో చిత్తూరు జిల్లా కుప్పం మండలం అనిమిగానిపల్లికి చెందిన 22, ఉత్తరాంధ్రకు చెందిన 31 మంది ఉన్నారు. జీవనోపాధి కోసం వెళ్లి అక్కడ కరోనా కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారందరినీ వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కుప్పం ప్రాంతానికి చెందిన 22 మంది పాస్‌పోర్టు నంబర్లతో సహా 53 మంది వివరాలను కేంద్రమంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు పొందుపర్చారు.


Updated Date - 2020-03-19T09:24:03+05:30 IST