ఆ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి: జర్మని

ABN , First Publish Date - 2020-07-28T04:59:24+05:30 IST

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా

ఆ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి: జర్మని

బెర్లిన్: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. వేసవి కారణంగా ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు. ‘రిస్క్ ఏరియాస్’ నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జెన్స్ స్పాన్ సోమవారం తెలిపారు. ప్రయాణీకులకు కరోనా పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా చేయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక జర్మనీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 దేశాలను ఈ రిస్క్ ఏరియాస్ జాబితాలో చేర్చనున్నట్టు తెలుస్తోంది. అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలైతే కచ్చితంగా ఈ జాబితాలో ఉండనున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఈ దేశాలే ఉన్నాయి. కాగా.. జర్మనీలో ఇప్పటివరకు మొత్తంగా 207,043 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా జర్మనీలో మొత్తం 9,203 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-07-28T04:59:24+05:30 IST