జర్మనీలో కొత్తగా 249 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-20T21:36:11+05:30 IST

జర్మనీలో గడిచిన 24 గంటల్లో 249 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.

జర్మనీలో కొత్తగా 249 కరోనా కేసులు

బెర్లిన్: జర్మనీలో గడిచిన 24 గంటల్లో 249 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అంతకుముందు రోజు నమోదైన 202 కేసులతో పోల్చితే తాజాగా నమోదైన కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,01,823కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో జర్మనీలో ఇప్పటివరకు కరోనా కారణంగా 9,086 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇప్పటివరకు1,87,800 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా.. జర్మనీలో అత్యధిక కేసులు బవేరియా నుంచే నమోదవుతున్నాయి. బవేరియాలో ఇప్పటివరు 49,775 కేసులు బయటపడ్డాయి. ఆ తరువాత నార్త్ రైన్- వెస్ట్‌ఫాలియాలో 46,075  కేసులు.. బడేన్ - వర్టెమ్‌బర్గ్‌లో 36,342 కేసులు నమోదయ్యాయి. ఇక జర్మని రాజధాని బెర్లిన్‌లో మొత్తంగా 8,779 కేసులు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే.. యూరప్ దేశాల్లో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అదుపు చేసిన దేశాల్లో జర్మనీ ముందుందనే చెప్పాలి. చుట్టుపక్కల దేశాలలో ఏప్రిల్, మే నెలల్లో నిత్యం వందలాది మరణిస్తూ వచ్చారు. అయితే జర్మనీలో మాత్రం మరణాల రేట్ చాలా తక్కువగా నమోదైంది.

Updated Date - 2020-07-20T21:36:11+05:30 IST