స్వీయ నిర్బంధంలోకి జర్మనీ చాన్స్‌లర్..

ABN , First Publish Date - 2020-03-23T16:13:45+05:30 IST

కొవిడ్-19 మరింత విజ‌ృంభించకుండా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసమూహాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన జర్మనీ.. తాజాగా ఇద్దరికి మించి ఎక్కువ

స్వీయ నిర్బంధంలోకి జర్మనీ చాన్స్‌లర్..

బెర్లిన్: కొవిడ్-19 మరింత విజ‌ృంభించకుండా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసమూహాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన జర్మనీ.. తాజాగా ఇద్దరికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేసింది. విద్యాలయాలు, షాపింగ్ మాల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. ఇదిలా ఉంటే.. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌‌ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 


ఇదిలా ఉంటే.. మార్చి 25 నుంచి అన్ని రకాల విమాన సర్వీసులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సవరణలు చేసింది. ప్రయాణికులు, ప్రభుత్వాల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో ఉంచుకుని 13 దేశాలకు విమాన సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. యూకే, స్విట్జర్‌లాండ్, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, మలేషియా, ఫిలిప్పిన్స్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, యూఎస్, కెనడాకు విమాన సర్వీసులను నడపనున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది. కాగా.. కొవిడ్-19 ప్రపంచ దేశాలపై పంజా విసిరింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 14,687‌కు చేరింది. 

Updated Date - 2020-03-23T16:13:45+05:30 IST