జార్జి ఫ్లాయిడ్ సోదరుడు.. ఫిలోనిస్ ఫ్లాయిడ్ ఉద్వేగభరిత ప్రసంగం!

ABN , First Publish Date - 2020-06-18T06:26:10+05:30 IST

జార్జి ఫ్లాయిడ్ హత్య ఘటనపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో జార్జి ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లా

జార్జి ఫ్లాయిడ్ సోదరుడు.. ఫిలోనిస్ ఫ్లాయిడ్ ఉద్వేగభరిత ప్రసంగం!

జెనీవా: జార్జి ఫ్లాయిడ్ హత్య ఘటనపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో జార్జి ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ సోరుడు పాల్గొని ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మే 25న అమెరికాలోని మిన్నెపోలీస్‌లో జార్జి ఫ్లాయిడ్ (46) అనే నల్లజాతి వ్యక్తిని, శ్వేతజాతి పోలీసు అధికారి అతికిరాతకంగా కాలితో తొక్కి చంపాడు. ఈ ఘటనతో అమెరికాలో నల్లజాతీయులు ఒక్కటయ్యారు. పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి.. జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ నిరసనలు ఇతర దేశాలకు కూడా విస్తరించాయి. ఈ నేపథ్యంలో జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో వీడియో కాల్‌ ద్వారా జార్జి ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్‌ పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికాలో నల్లజాతీయులకు విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆఫ్రికన్-అమెరికన్లకు అండగా నిలవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో జాత్యహంకారం.. పోలీసుల అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి కావాల్సిన ముసాయిదా తీర్మానంపై చర్చలు జరుపుతోంది. 


Updated Date - 2020-06-18T06:26:10+05:30 IST