క‌రోనా ఎఫెక్ట్‌.. దుబాయిలో మూత‌పడ‌నున్న‌ ఇండియ‌న్ స్కూల్ !

ABN , First Publish Date - 2020-06-25T15:38:19+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అతలాకుత‌లం అవుతోంది.

క‌రోనా ఎఫెక్ట్‌.. దుబాయిలో మూత‌పడ‌నున్న‌ ఇండియ‌న్ స్కూల్ !

దుబాయి: మ‌హ‌మ్మారి క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అతలాకుత‌లం అవుతోంది. అగ్ర‌రాజ్యాలను సైతం కోవిడ్‌-19 తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. అటు గ‌ల్ఫ్‌లో కూడా ఈ వైర‌స్ తీవ్ర‌త అధికంగానే ఉంది. ప్ర‌ధానంగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ఖ‌తార్‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఆయా దేశాల్లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. దీని ప్ర‌భావం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డ‌డంతో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతున్న‌వారు కోకోల్ల‌లు. ఈ ఆర్థిక భారం విద్యా సంస్థ‌ల‌ను విడిచిపెట్ట‌లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంక్షోభం వేళ స్కూల్ టీచ‌ర్ల‌కు, సిబ్బందికి జీతాలు చెల్లించ‌లేక‌, నిర్వాహ‌ణ క‌ష్టంగా మారడంతో యాజ‌మాన్యాలు శాశ్వ‌తంగా పాఠ‌శాల‌ల‌ను క్లోజ్ చేస్తున్నాయి.


ఇలాగే దుబాయిలోని ఓ ఇండియ‌న్ స్కూల్ పూర్తిగా మూత‌ప‌డబోతోంది. నాలుగేళ్ల క్రితం దుబాయిలో ఓపెన్ అయిన‌ జెమ్స్(జీఈఎంఎస్‌) హెరిటేజ్ ఇండియ‌న్ స్కూల్ క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో శాశ్వ‌తంగా మూత వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం ఈ స్కూల్‌లో చ‌దువుతున్న విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు యాజ‌మాన్యం సందేశాలు పంపించింది. కాగా, విద్యార్థుల‌ను త‌మ వేరే బ్రాంచీల్లో తీసుకుంటామ‌ని జెమ్స్(జీఈఎంఎస్‌) గ్లోబల్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ క్రిస్టోఫర్ స్టోన్ తెలిపారు. 2021, మార్చిలో ఈ పాఠ‌శాల‌ను శాశ్వ‌తంగా మూసివేస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-25T15:38:19+05:30 IST