కరోనాను ఎదుర్కొనేందుకు మరో 250 మిలియన్ డాలర్ల విరాళమిచ్చిన గేట్స్ ఫౌండేషన్

ABN , First Publish Date - 2020-12-11T08:48:25+05:30 IST

కరోనాపై పోరాడేందుకు ‘ద బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్’ మరో 250 మిలియన్ డాలర్ల(రూ. 1,842 కోట్లు) విరాళాన్ని ఇచ్చేందుకు

కరోనాను ఎదుర్కొనేందుకు మరో 250 మిలియన్ డాలర్ల విరాళమిచ్చిన గేట్స్ ఫౌండేషన్

జోహన్నెస్‌బర్గ్: కరోనాపై పోరాడేందుకు ‘ద బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ మరో 250 మిలియన్ డాలర్ల(రూ. 1,842 కోట్లు) విరాళాన్ని ఇచ్చేందుకు సిద్దమైంది. ఆఫ్రికా, దక్షిణాసియాలోని అతిపేద దేశాలకు వ్యాక్సిన్ డోస్‌లు అందేలా ఈ విరాళంలో కొంతభాగాన్ని గేట్స్ ఫౌండేషన్ ఖర్చు చేయనుంది. ‘మనం ఊహించిన దాని కంటే సమర్థవంతమైన వ్యాక్సిన్లు, కొత్త డ్రగ్స్ వచ్చాయి. కానీ ఈ ఆవిష్కరణలు ప్రపంచ నలుమూలలకు వెళ్తేనే మనుషుల ప్రాణాలను కాపాడగలం’ అని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. ప్రపంచంలోని అతిపేద దేశాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఆఫ్రికాకు ఫండింగ్ అనేది చాలా పెద్ద అడ్డంకి అయిపోయింది. 


వచ్చే ఏడాది మార్చి నాటికి కేవలం మూడు శాతం మంది ఆఫ్రికన్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలనేది లక్ష్యంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది చివరి నాటికి కూడా కేవలం 20 శాతం మంది ఆఫ్రికన్లు మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశమున్నట్టు డబ్ల్యూహెచ్ఓ తెలుసుకుంది. ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ పేద దేశాలకు వ్యాక్సిన్ అందేలా విరాళమిచ్చేందుకు ముందుకొచ్చింది. తాజాగా ప్రకటించిన విరాళంతో ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల మందికి వ్యాక్సిన్‌ చేరేలా సహాయపడతామని ఆఫ్రికాలోని గేట్స్ ఫౌండేషన్ కొవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ సోలొమాన్ జ్యూడూ తెలిపారు.

Updated Date - 2020-12-11T08:48:25+05:30 IST