ఇక్కడి వధువు.. అక్కడి వరుడు పెళ్లితో ఒక్కటయ్యారు..!

ABN , First Publish Date - 2020-02-06T02:05:40+05:30 IST

యూపీలోని రాయ్‌బరేలీలో జరిగిన ఒక వివాహ వేడుక చర్చనీయాంశంగా మారింది. వధువు రాయబరేలీకి చెందినది కాగా, వరుడు ఫ్రాన్స్ నివాసి. మీడియాకు అందిన సమా

ఇక్కడి వధువు.. అక్కడి వరుడు పెళ్లితో ఒక్కటయ్యారు..!

యూపీలోని రాయ్‌బరేలీలో జరిగిన ఒక వివాహ వేడుక చర్చనీయాంశంగా మారింది. వధువు రాయబరేలీకి చెందినది కాగా, వరుడు ఫ్రాన్స్ నివాసి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2019లో రాయ్‌బరేలీకి చెందిన నీతి ఉద్యోగ వేటలో ఫ్రాన్స్ వెళ్లింది. అక్కడ అమెకు తనతో పాటు పనిచేస్తున్న సిల్వా మార్టిన్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. రాయబరేలీలో హిందూ సంప్రదాయ విధానంలో వీరి వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వరుడు హిందూ సంప్రదాయంలోని పెళ్లి మంత్రాలకు అర్థం తెలుసుకుని, ఫ్రెంచి భాషలో వాటిని పఠించాడు. ఈ సందర్భంగా నీతి మాట్లాడుతూ మా తల్లిదండ్రులు ఈ వివాహానికి అనుమతివ్వకపోతే చేసుకునేదానిని కానని అన్నారు. తన తల్లిదండ్రుల అనుమతితో, బంధువుల సమక్షంలో వివాహం వైభవంగా జరిగిందన్నారు.


Updated Date - 2020-02-06T02:05:40+05:30 IST